HomeMovie Newsకన్నప్ప - ప్రభాస్ లేదా క్లైమాక్స్ కాదు అసలు హైలైట్ అదే

కన్నప్ప – ప్రభాస్ లేదా క్లైమాక్స్ కాదు అసలు హైలైట్ అదే

- Advertisement -

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన తాజా మైథాలజికల్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. మొదటి నుంచి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలకపాత్రల్లో నటించారు.

ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన కన్నప్ప సినిమా ఇటీవల గ్రాండ్ గా ఆడియన్సు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ మూవీలో మంచు విష్ణు నటన బాగుందని, సాంగ్స్ తో పాటు ప్రభాస్ పాత్ర కూడా ఆకట్టుకుందని పలువురు ప్రేక్షకాభిమానులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు అయితే సెకండ్ హాఫ్ బాగుందని, చివరి ముప్పై నిముషాలు బాగా తీసారని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది మూవీ లోని శివశంకర సాంగ్.

సరైన సందర్భంలో వచ్చే ఈ సాంగ్ లో లిరిక్స్, సాంగ్ మొత్తం కూడా ఎంతో పెద్ద హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆ సాంగ్ యొక్క కొరియోగ్రఫీ తో పాటు విష్ణు పెర్ఫార్మన్స్ కూడా ఎంతో బాగుంది. మరి మొత్తంగా కన్నప్ప ఎంతమేర ఓవరాల్ కలెక్షన్ రాబడుతుందో చూడాలి. 

See also  'కుబేర' ఏరియా వైజ్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories